Breaking News

ఎంపీ పప్పూ యాదవ్ అరెస్టు..


Published on: 07 Feb 2026 18:53  IST

పూర్ణియా పార్లమెంటు సభ్యుడు పప్పూ యాదవ్‌ ను పాట్నా పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. 1995 నాటి వివాదాస్పద భూముల కేసులో శుక్రవారం రాత్రి ఈ అరెస్టు జరిగింది. పాత ఐపీసీ సెక్షన్లు 419, 420, 468, 448, 506, 120B కింద ఆయనపై గర్దానీబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు పాట్నా ఎస్‌‌పీ భానుప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, షెడ్యూల్ తేదీకి కోర్టు ముందు హాజరుకావడంలో ఎంపీ విఫలమయ్యారని, దీంతో ఈ అరెస్టు జరిగిందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement