Breaking News

వైభవంగా గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

కర్నూలు జిల్లా డోన్ (Dhone)  పట్టణంలో గంగమ్మ దేవాలయం పునర్నిర్మాణం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు 2026 ఫిబ్రవరి 21 (శనివారం) న అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Published on: 21 Feb 2026 15:25  IST

కర్నూలు జిల్లా డోన్ (Dhone)  పట్టణంలో గంగమ్మ దేవాలయం పునర్నిర్మాణం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు 2026 ఫిబ్రవరి 21 (శనివారం) న అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గర్భాలయంలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు.ప్రతిష్ఠాపన సందర్భంగా గత కొన్ని రోజులుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, జలధివాసం, ధాన్యాధివాసం వంటి ప్రత్యేక హోమాలు మరియు వైదిక క్రతువులు నిర్వహించబడుతున్నాయి.21వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం మరియు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు జరుగుతాయి.ఈ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి