Breaking News

102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు పేరును చేర్చుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు పేరును చేర్చుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.


Published on: 26 Feb 2026 12:39  IST

రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు పేరును చేర్చుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 25, 2026న బెంగళూరులోని ప్రత్యేక PMLA కోర్టులో ఈ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఏడాది కాలంలో (మార్చి 2024 - మార్చి 2025) సుమారు 127 కిలోల బంగారాన్ని (విలువ రూ. 102.55 కోట్లు) ఈ ముఠా అక్రమంగా భారత్‌కు తరలించినట్లు ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

రన్యారావుతో పాటు ఆమె సహచరులు తరుణ్ కొండూరు, సాహిల్ సకారియా జైన్ పేర్లను కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.గతేడాది మార్చిలో దుబాయ్ నుండి వస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 14.2 కిలోల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఈమె కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రరావుకు సవతి కుమార్తె.మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రన్యారావుకు చెందిన సుమారు రూ. 34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

గతంలోనే DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ఆమెకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 102 కోట్ల భారీ జరిమానా విధించింది.

Follow us on , &

ఇవీ చదవండి