Breaking News

జూదంలో వివాదం స్నేహితుడు పై కాల్పులు

చిత్తూరు జిల్లాలో పేకాట (జూదం) కారణంగా జరిగిన వివాదం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.చిత్తూరు రూరల్ మండలం, తుమ్మిందపాళ్యం గ్రామం.మరణించిన యువకుడిని సాయికుమార్ (24) గా గుర్తించారు.


Published on: 04 Mar 2026 18:58  IST

చిత్తూరు జిల్లాలో పేకాట (జూదం) కారణంగా జరిగిన వివాదం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.చిత్తూరు రూరల్ మండలం, తుమ్మిందపాళ్యం గ్రామం.మరణించిన యువకుడిని సాయికుమార్ (24) గా గుర్తించారు. నిందితుడు అతని స్నేహితుడు ఢిల్లీ బాబు (26).పేకాట ఆడుతున్న సమయంలో సుమారు రూ. 2 లక్షల బాకీ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఘర్షణ ముదరడంతో ఆగ్రహానికి లోనైన ఢిల్లీ బాబు, తన వద్ద ఉన్న నాటు తుపాకీతో సాయికుమార్‌పై కాల్పులు జరిపాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు ఢిల్లీ బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి