Breaking News

అయ్యప్ప స్వామి ముఖంపై  సూర్యకిరణాలు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం అయ్యప్ప స్వామి ఆలయంలో 11 మార్చి 2026, బుధవారం నాడు తెల్లవారుజామున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.


Published on: 11 Mar 2026 16:07  IST

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం అయ్యప్ప స్వామి ఆలయంలో 11 మార్చి 2026, బుధవారం నాడు తెల్లవారుజామున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ రోజు ఉదయం సూర్యకిరణాలు నేరుగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తాకాయి.

తెల్లవారుజామున సూర్యరశ్మి నేరుగా గర్భాలయంలోని స్వామివారి ముఖంపై పడి, కిరణాలతో అభిషేకం చేసినట్లుగా కనిపించింది.ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిపై సూర్యకిరణాలు ప్రసరించడాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.సాధారణంగా కొన్ని ప్రత్యేక ఆలయాల్లో మాత్రమే ఏడాదికి ఒకట్రెండు సార్లు ఇలా సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకుతుంటాయి. తూర్పుగంగవరం అయ్యప్ప ఆలయంలో ఈ దృశ్యం ఆవిష్కృతం కావడం విశేషం. 

Follow us on , &

ఇవీ చదవండి