Breaking News

మరోసారి జైలుకు మాజీ ఎంపీ నందిగం


Published on: 19 May 2025 14:29  IST

టీడీపీ కార్యకర్త ఇసుక.పల్లి రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్​కు మంగళగిరి న్యాయస్థానం జూన్​2వ తేదీ వరకు రిమాండ్​విధించింది. గుంటూరు సబ్​జైలుకు సురేష్​ను తరలించారు. నిన్న సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్య కేసులోనందిగం సురేష్​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి. ఇప్పుడు మరో కేసులో అరెస్టు అయ్యాడు.

Follow us on , &

ఇవీ చదవండి