Breaking News

కరీంనగర్‌ టూటౌన్ ఎస్సై భార్య ఆత్మహత్య

కరీంనగర్‌లో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య (32) బుధవారం (మార్చి 18, 2026) ఆత్మహత్య చేసుకున్నారు.


Published on: 18 Mar 2026 15:58  IST

కరీంనగర్‌లో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య (32) బుధవారం (మార్చి 18, 2026) ఆత్మహత్య చేసుకున్నారు. దివ్య మంగళవారం రాత్రి తన నివాసంలో విషపూరితమైన గన్నేరు పప్పు (Oleander seeds) తిని ఆత్మహత్యాయత్నం చేశారు.అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ, ఆ నొప్పి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, కుటుంబ కలహాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement