Breaking News

తండ్రి మందలించాడని బాధతో యువతి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లిలో తండ్రి మందలించాడని మనస్తాపంతో లింగంపల్లి వర్షిత (19)అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మార్చి 20, 2026న వెలుగులోకి వచ్చింది. 


Published on: 20 Mar 2026 10:31  IST

మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లిలో తండ్రి మందలించాడని మనస్తాపంతో లింగంపల్లి వర్షిత (19)అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మార్చి 20, 2026న వెలుగులోకి వచ్చింది. 

బెల్లంపల్లి పట్టణం సుభాష్‌నగర్‌ బస్తీకి చెందిన వర్షిత ఇటీవల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది.వర్షిత తన స్నేహితుడికి ఇంట్లో నుంచి కొంత ఆర్థిక సాయం చేసింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్రీనివాస్, తమ ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో ఎందుకు డబ్బులు ఇచ్చావని ఆమెను మందలించారు.

ఎప్పుడూ మందలించని తండ్రి కోప్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్షిత, బుధవారం మధ్యాహ్నం ఇంట్లోని బాత్‌రూంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండో పట్టణ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి