Breaking News

హైదరాబాద్‌లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను అధికారికంగా నోటిఫై చేసింది.

హైదరాబాద్‌లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను 20 మార్చి 2026 (శుక్రవారం) అధికారికంగా నోటిఫై చేసింది.


Published on: 20 Mar 2026 15:24  IST

హైదరాబాద్‌లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను 20 మార్చి 2026 (శుక్రవారం) అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, హైదరాబాద్‌లో నివసించే ఉద్యోగులు ఇకపై తమ బేసిక్ శాలరీలో 50% వరకు ఇంటి అద్దె భత్యం (HRA) పన్ను మినహాయింపు పొందవచ్చు. 

గతంలో కేవలం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకు మాత్రమే ఉన్న 'మెట్రో' హోదాను ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలకు కూడా విస్తరించారు.ఇప్పటివరకు హైదరాబాద్ ఉద్యోగులకు HRA మినహాయింపు పరిమితి 40% ఉండగా, దానిని 50 శాతానికి పెంచారు.

ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.ఈ HRA ప్రయోజనం కేవలం పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో (New Tax Regime) ఈ మినహాయింపు ఉండదు.

ఈ మార్పు వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 2027లో దాఖలు చేసే ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) సమయంలో పన్ను ఆదా అవుతుంది. 

కొత్త నిబంధనల ప్రకారం ఈ మూడింటిలో ఏది తక్కువైతే అది మినహాయింపుగా లభిస్తుంది.

సంస్థ నుండి పొందిన అసలు HRA.

మీరు చెల్లించిన అద్దెలో నుంచి బేసిక్ శాలరీలో 10% తీసివేయగా మిగిలిన మొత్తం.

మీ బేసిక్ శాలరీలో 50% మొత్తం (హైదరాబాద్ ఉద్యోగులకు).

Follow us on , &

ఇవీ చదవండి