Breaking News

పార్వతీపురంలో గోడ కూలి 8ఏళ్ళ బాలుడు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం (20 మార్చి 2026) జరిగిన విషాదకర ఘటనలో గోడ కూలి బిడ్డిక హేమంత్ (8) అనే మూడో తరగతి బాలుడు మృతి చెందాడు.

Published on: 20 Mar 2026 19:24  IST

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం (20 మార్చి 2026) జరిగిన విషాదకర ఘటనలో గోడ కూలి బిడ్డిక హేమంత్ (8) అనే మూడో తరగతి బాలుడు మృతి చెందాడు.

సీతంపేట మండలం కుసిమి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది.మధ్యాహ్న భోజన సమయంలో బిడ్డిక హేమంత్ పాఠశాల ఆవరణలోని పాత గోడ వద్ద ఆడుకుంటుండగా, అది ఒక్కసారిగా అతనిపై కూలిపోయింది.తీవ్ర గాయాలపాలైన హేమంత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి