Breaking News

బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి..


Published on: 19 May 2025 18:45  IST

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కారు బాంబు పేలింది. ఖిలా అబ్దుల్లాలో చోటుచేసుకున్న ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. 20 మందిలో 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గులిస్తాన్ టౌన్‌లోని ‘పాకిస్థాన్ ఫ్రంటైర్ కాప్స్’ భవనం లక్ష్యంగా ఈ కారు బాంబు దాడి జరిగింది. భారీ స్థాయిలో బాంబు పేలుడు సంభవించటంతో ఫ్రంటైర్ కాప్స్ భవనం దగ్గర ఉన్న చాలా షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి