Breaking News

ఆగి ఉన్నఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు

చిత్తూరు జిల్లాలో ఈరోజు (మార్చి 28, 2026) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.


Published on: 28 Mar 2026 16:20  IST

చిత్తూరు జిల్లాలో ఈరోజు (మార్చి 28, 2026) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ (APSRTC) బస్సును వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.మరణించిన వారు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందినవారు. మృతులను శ్రీధర్ రావు (46), ఆయన భార్య లక్ష్మి (42), మరియు వారి కుమార్తె ఆద్విక (16)గా గుర్తించారు.

వీరు బెంగళూరు నుండి కారులో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.కారు అతివేగంగా వచ్చి బస్సు వెనుక భాగం కిందికి దూసుకుపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడగా, అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి