Breaking News

కోర్టు ప్రాంగణంలో అనంతబాబు అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ భాస్కర్)ను పోలీసులు 2026 ఏప్రిల్ 24, శుక్రవారం నాడు రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేశారు. 


Published on: 24 Apr 2026 16:56  IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ భాస్కర్)ను పోలీసులు 2026 ఏప్రిల్ 24, శుక్రవారం నాడు రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేశారు. తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై నమోదైన కొత్త కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రైవర్ హత్య కేసులో తన బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ నిమిత్తం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ ముగించుకుని బయటకు రాగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనను కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అనంతబాబు అరెస్ట్ సమయంలో రాజమండ్రి కోర్టు వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు వైసీపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి