Breaking News

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


Published on: 20 May 2025 17:04  IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సాగునీరు ఇచ్చే సమయానికి ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పారు. కాళేశ్వరం కూలడానికి కారణమేవరో తేల్చడానికి ఇంత ఆలస్యమెందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణను నీరు గార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలోనూ విచారణను నీరుగార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్ కుదరడం వల్లే ఈ విచారణలను పక్కదోవ పట్టిస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి