Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం


Published on: 21 May 2025 12:14  IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లుఫ్తాన్సా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విమానం రన్ వే మీదకు వెళ్లిన వెంటనే ముందు టైరులో సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం వారి సూచన మేరకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి మళ్లించారు. ఈ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి