Breaking News

ఎండాకాలంలో అక్వేరియాన్ని చల్లగా ఉంచాలంటే ఇవి తప్పనిసరి

వేసవిలో అక్వేరియంలోని నీరు వేడెక్కకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Published on: 08 May 2026 18:12  IST

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అక్వేరియంలోని చేపల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇంటి అలంకరణలో భాగంగా అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకునే వారు ఈ కాలంలో ప్రత్యేక సంరక్షణ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక వేడి కారణంగా నీటి ఉష్ణోగ్రత పెరిగితే చేపల జీవక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

అక్వేరియం గాజుతో తయారవడం వల్ల నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే నీటిని తరచూ మార్చడం మంచిది. అయితే మరీ చల్లటి నీరు లేదా ఐస్ ముక్కలు నేరుగా వేయకూడదు. అలా చేస్తే చేపల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అక్వేరియంలో ఉండే రాళ్లు, గడ్డి వంటి వస్తువులను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు.

అక్వేరియంలో నిరంతరం లైట్లు ఆన్‌లో ఉంచడం వల్ల కూడా నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. పగటిపూట లైట్లు ఆర్పేయడం లేదా ఫిష్ ఫ్రెండ్లీ లైట్లను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే అక్వేరియాన్ని ఇంట్లో చల్లగా ఉండే మూలలో ఉంచి, అవసరమైతే చిన్న ఫ్యాన్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

నీరు వేడెక్కినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో చేపలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే అక్వేరియం వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. లిక్విడ్ ఆక్సిజన్ డ్రాప్స్ వాడటం, అక్వేరియం చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వంటి చర్యలు చేపలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి