Breaking News

కుమారుడిపై పోక్సో కేసు తల్లిదండ్రుల ఆత్మహత్య

కుమారుడిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేయడంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన 2026, మే 8 (శుక్రవారం)న బాపట్ల జిల్లాలోని కొల్లూరులో చోటుచేసుకుంది.

Published on: 09 May 2026 14:32  IST

కుమారుడిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేయడంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన 2026, మే 8 (శుక్రవారం)న బాపట్ల జిల్లాలోని కొల్లూరులో చోటుచేసుకుంది.

కొల్లూరుకు చెందిన నండూరు జయరావు అనే యువకుడు, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ఒక మైనర్ బాలికను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.దీనిపై బాలిక తల్లిదండ్రులు చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జయరావుపై పోక్సో చట్టం కింద మరియు ఇతర సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

తమ కుమారుడిపై తీవ్రమైన పోక్సో కేసు నమోదైందని తెలిసి, మనస్తాపానికి గురైన జయరావు తల్లిదండ్రులు ఎన్. కృష్ణ, రమణ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు వారు ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు.సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement