Breaking News

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు సంచలన ప్రకటన

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు.


Published on: 22 May 2026 14:08  IST

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. 2026 మే 22న హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఒరిజినల్ ఫార్మా సిటీప్రాజెక్టును మళ్లీ యథాతథంగా పునరుద్ధరిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేవలం ‘ఫార్మా సిటీ’కి మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. ల్యాండ్ యూజ్ మార్చడం లేదా ప్రాజెక్ట్ డీవియేషన్ ఉంటే, సేకరించిన రైతుల భూములను తిరిగి వారికే ఇచ్చేయాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని కొనసాగిస్తామని ఓ వైపు హైకోర్టుకు చెబుతూ, బయట మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, పరిశ్రమల స్థాపనను పక్కనబెట్టేసిందని హరీశ్ రావు ఆరోపించారు.బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, రైతులకు న్యాయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి