Breaking News

భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక 'ట్రూత్ సోషల్' ఖాతాలో రీపోస్ట్ (షేర్) చేశారు

భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక 'ట్రూత్ సోషల్' ఖాతాలో రీపోస్ట్ (షేర్) చేశారు.


Published on: 27 May 2026 11:12  IST

భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక 'ట్రూత్ సోషల్' ఖాతాలో రీపోస్ట్  చేశారు.భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్వేదికగా ప్రధాని మోదీపై ట్రంప్ కురిపించిన ప్రశంసలను కోట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌ను ట్రంప్ సోమవారం సాయంత్రం రీపోస్ట్ చేయడంతో పాటు, న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వీడియో క్లిప్‌ను కూడా జత చేశారు.ఢిల్లీ వేడుకల్లో రాయబారి సెర్గియో గోర్ తన ఫోన్ స్పీకర్‌ను మైక్రోఫోన్ ముందు ఉంచగా, ట్రంప్ ప్రత్యక్షంగా ఫోన్ కాల్ ద్వారా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు:

మోదీ నా మంచి స్నేహితుడు నాకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ ఒక గొప్ప నాయకుడు, నా మంచి స్నేహితుడు అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్‌కు 100% మద్దతు: "భారత్ ఎల్లప్పుడూ నాపై 100 శాతం నమ్మకం ఉంచవచ్చు. భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు" అని హామీ ఇచ్చారు.

భారత్-అమెరికా బంధం: భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత అత్యంత బలంగా, దగ్గరగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. మార్కో రూబియో భారత్‌లో జరుపుతున్న నాలుగు రోజుల వ్యూహాత్మక పర్యటనల నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ స్థాయి ప్రశంసలు రావడం ఇరు దేశాల దౌత్య సంబంధాలలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement