Breaking News

కర్నూలులో ఆర్‌సీబీ ఫ్యాన్స్ భారీ రచ్చ

ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించడంతో, మే 31 అర్థరాత్రి కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద ఆర్‌సీబీ అభిమానులు శృతిమించి భారీ రచ్చ చేశారు.


Published on: 01 Jun 2026 15:41  IST

ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించడంతో, మే 31 అర్థరాత్రి కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద ఆర్సీబీ అభిమానులు శృతిమించి భారీ రచ్చ చేశారు. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ కప్పు గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే కర్నూలులో ఈ వేడుకలు కాస్త ఉద్రిక్తతకు దారితీశాయి.

అర్ధరాత్రి వందలాది మంది యువకులు ఆర్‌సీబీ జెండాలతో రోడ్లపైకి వచ్చి రాజ్ విహార్ సర్కిల్ వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేశారు.అతి ఉత్సాహం ప్రదర్శించిన కొందరు ఫ్యాన్స్ అక్కడ వెళ్తున్న మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రాళ్లతో దాడి చేసి వాటి అద్దాలను పూర్తిగా పగలగొట్టారు.రోడ్డు భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కిందపడేసి హంగామా సృష్టించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ హుందా లేని ప్రవర్తన మరియు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మరియు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, సెక్రటేరియేట్ పరిసరాల్లో కూడా ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇలాగే బైక్‌లపై వచ్చి రచ్చ చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement