Breaking News

కాశీబుగ్గలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో గంజి కీర్తన  అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్ర పని ఒత్తిడి, మానసిక ఆందోళన తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టెక్ పరిశ్రమలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ఈ విచారకరమైన ఘటన అద్దం పడుతోంది.


Published on: 16 Jun 2026 16:18  IST

వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో గంజి కీర్తన  అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్ర పని ఒత్తిడి, మానసిక ఆందోళన తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టెక్ పరిశ్రమలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ఈ విచారకరమైన ఘటన అద్దం పడుతోంది.

మృతురాలిని కాశీబుగ్గకు చెందిన పాత పేపర్ల వ్యాపారి గంజి ఉమాశంకర్ రెండో కుమార్తె గంజి కీర్తన (25) గా గుర్తించారు.ఆమె గతంలో ఢిల్లీలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించేది.ఉద్యోగంలో పనిభారం పెరిగిపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడి లోకి వెళ్ళిపోయింది. కూతురి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు మూడు నెలల క్రితమే ఆమెను వరంగల్‌కు తీసుకువచ్చారు.

మానసిక వేదన నుండి కోలుకోవడానికి హనుమకొండలోని ఒక సైకియాట్రిస్ట్ వద్ద ఆమెకు కొంతకాలంగా చికిత్స కూడా అందిస్తున్నారు. మంగళవారం రోజున తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో కీర్తన తీవ్ర మనస్తాపంతో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కీర్తన తండ్రి ఉమాశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానిక కాశీబుగ్గ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement