Breaking News

నాలుగు హత్యల మిస్టరీ చేదించిన పోలీస్లు

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. కోట్లాది రూపాయల ఆస్తి కోసమే మృతురాలు హసీనా సొంత కూతురు, అల్లుడు సుపారీ గ్యాంగ్‌ సహాయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.


Published on: 25 Jun 2026 16:16  IST

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. కోట్లాది రూపాయల ఆస్తి కోసమే మృతురాలు హసీనా సొంత కూతురు, అల్లుడు సుపారీ గ్యాంగ్‌ సహాయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

షేక్ మహమ్మద్ సుల్తాన్ (45) – ప్రకాశం బజారులో బ్యాగుల వ్యాపారి.

హసీనా (40) – సుల్తాన్ భార్య, ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.

మహ్మద్ ముజమ్మిల్ (20) – సుల్తాన్ మొదటి భార్య కుమారుడు (ఏసీ టెక్నీషియన్).

అక్సరా/అఫోరా (11) – సుల్తాన్ మొదటి భార్య కుమార్తె (7వ తరగతి విద్యార్థిని).

ఆస్తి తగాదాలే కారణం: మృతురాలు హసీనాకు గతంలో రెండు వివాహాలు కాగా, సుల్తాన్ ఆమెకు మూడో భర్త. హసీనా పేరిట దాదాపు ఒక కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఈ ఆస్తిని ఆమె తన మూడో భర్త పిల్లలైన ముజమ్మిల్, అక్సరా పేరిట వీలునామా రాస్తానని చెప్పడంతో హసీనా మొదటి భర్తకు పుట్టిన సొంత కూతురు, ఆమె భర్త కక్ష పెంచుకున్నారు.

సుపారీ గ్యాంగ్‌తో ప్లాన్: ఆస్తి దక్కదనే భయంతో హైదరాబాద్‌ శివారులోని కుంట్లూరులో ఉంటున్న హసీనా కూతురు, అల్లుడు కలిసి ఒక సుపారీ గ్యాంగ్‌ను (రౌడీషీటర్లు) ఆశ్రయించి పక్కా స్కెచ్ వేశారు.

దారుణంగా నరికివేత: జూన్ 19న అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు ఇంట్లోకి ప్రవేశించి అత్యంత క్రూరంగా కత్తులతో దాడి చేశారు.

పోస్టుమార్టం నివేదిక: ఈ దాడి ఎంత ఘోరంగా జరిగిందో పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. కరాటే తెలిసిన ముజమ్మిల్ నిందితులను గట్టిగా ప్రతిఘటించడంతో అతనికి ఏకంగా 16 కత్తిపోట్లు పొడిచారు. భయంతో మంచం కింద దాక్కున్న 11 ఏళ్ల చిన్నారి అక్సరాను బయటకు లాగి, గోడకేసి కొట్టి, 9 చోట్ల కత్తితో పొడిచి చంపారు. అలాగే హసీనాకు 7, సుల్తాన్‌కు 6 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.

హత్యలు చేసిన అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి, సాక్ష్యాలు దొరకకుండా సీసీ కెమెరాలను నిలిపివేసి వెళ్లారు. జూన్ 22న ఆ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుళ్లిన స్థితిలో నలుగురి శవాలు లభ్యమయ్యాయి.

నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. మొబైల్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ప్రధాన సూత్రధారులైన హసీనా కూతురు, అల్లుడితో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement