Breaking News

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై 2026 జూన్ 26 (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.


Published on: 26 Jun 2026 12:35  IST

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై 2026 జూన్ 26 (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని, వేగంగా వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది.శుక్రవారం ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు తలకు తీవ్ర గాయాలై స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న వినోద్ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.వినోద్ అనే వ్యక్తి గచ్చిబౌలి నుంచి కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్‌పేట్ వైపు నుంచి శ్రీకాంత్, విఠల్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లైఓవర్‌పై ప్రమాదకరంగా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చారు. ఫ్లైఓవర్‌పై వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో, ఊహించని విధంగా రాంగ్ రూట్‌లో ఎదురైన స్కూటీని బుల్లెట్ బైక్ అతి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో స్కూటీపై ఉన్న ఇద్దరూ రోడ్డుపై ఎగిరిపడి మరణించారు.

ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement