Breaking News

భారతదేశంలో త్వరలోనే పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు

భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.


Published on: 17 Jul 2026 19:17  IST

భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు (17 జూలై 2026) ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ , నోట్ల ముద్రణకు అవసరమైన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది.

ప్రాథమికంగా అత్యధికంగా చేతులు మారే రూ. 10, రూ. 20 విలువైన నోట్లతో ఈ పైలట్ ప్రాజెక్ట్ (ప్రయోగం) మొదలవుతుంది.ఈ ప్రయోగం విజయవంతమైతే, 2027 నుండి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పాలిమర్ నోట్లను అందుబాటులోకి తెస్తారు.

పాత నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి.కొత్త పాలిమర్ నోట్లు, పాత పేపర్ నోట్లు రెండూ మార్కెట్లో కలిసి చలామణిలో ఉంటాయి.పాత నోట్లు చిరిగిపోయి వెనక్కి వచ్చినప్పుడు వాటి స్థానంలో కొత్త ప్లాస్టిక్ నోట్లను ఆర్‌బీఐ ప్రవేశపెడుతుంది.

పాలిమర్ నోట్ల ఉపయోగాలు

ఎక్కువ మన్నిక: ఇవి సాధారణ పేపర్ నోట్ల కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

వాటర్ ప్రూఫ్: ఇవి ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారు కావడం వల్ల నీటిలో నానినా లేదా చెమట తగిలినా అస్సలు పాడవు.

నకిలీ నోట్లకు చెక్: ఈ నోట్లలో పారదర్శక విండోస్ వంటి అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల వీటిని కాపీ చేయడం చాలా కష్టం.

ఖర్చుల తగ్గింపు: నోట్లు త్వరగా పాడవకుండా ఉండటం వల్ల ఆర్‌బీఐకి ఏటా అయ్యే వేల కోట్ల రూపాయల ముద్రణ ఖర్చు తగ్గుతుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, కెనడా, మరియు న్యూజిలాండ్ వంటి అనేక దేశాలలో ఈ పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను (నోట్ల రద్దు వంటి వార్తలను) నమ్మవద్దని, ఆర్‌బీఐ మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement