Breaking News

పోలవరం కుడి కాలువలో బాలుడి గల్లంతు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో జారిపడి ఒక బాలుడు గల్లంతయ్యాడు


Published on: 13 Aug 2026 16:14  IST

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పోలవరం కుడి కాలువలో జారిపడి ఒక బాలుడు గల్లంతయ్యాడు. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఆరుమళ్ళ లీలా మోహన్ రెడ్డి (12) అనే బాలుడు ప్రమాదానికి గురయ్యాడు.కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.రాత్రి సమయంలో బాలుడు తన స్నేహితులను కలిసేందుకు సైకిల్‌పై బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి పోలవరం కుడి కాలువలోకి జారిపడి కొట్టుకుపోయాడు.

తాజా పరిస్థితి

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు స్థానిక ఈతగాళ్లు రంగంలోకి దిగారు.గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement