Breaking News

వివాహేతర సంబంధం..వివాహిత దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా అనూష (22) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘోర ఘటన వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.


Published on: 13 Aug 2026 16:39  IST

నాగర్‌కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా అనూష (22) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘోర ఘటన వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.

కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22). ఈమెకు భర్త (చెన్నయ్య), ఒక కుమారుడు ఉన్నారు. కల్వకుర్తిలోని ఒక లేడీస్ కార్నర్‌లో అనూష పనిచేసేది.

అదే గ్రామానికి చెందిన రాములు (రాము). అనూషకు వివాహం అయినప్పటికీ గత కొంతకాలంగా రాముతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.బుధవారం రాత్రి రాము ఆమెను నమ్మించి ఒడ్డోని రాళ్ల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, రాము ఆమెను కిరాతకంగా హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు.

ప్రస్తుత పరిస్థితి

సమాచారం అందుకున్న వెల్దండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాముతో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement