Breaking News

ఆడియో ప్రొడక్ట్స్ తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశీయ బ్రాండ్ మివి (Mivi), భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.

ఇప్పటివరకు ఆడియో ప్రొడక్ట్స్ (ఇయర్‌బడ్స్, స్పీకర్లు) తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశీయ బ్రాండ్ మివి (Mivi), భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Flipkart లో ఈ కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన "Coming Soon" టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది.


Published on: 25 Aug 2026 12:37  IST

ఇప్పటివరకు ఆడియో ప్రొడక్ట్స్ (ఇయర్‌బడ్స్, స్పీకర్లు) తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశీయ బ్రాండ్ మివి (Mivi), భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Flipkart లో ఈ కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన "Coming Soon" టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

లాంచ్ ఎప్పుడు: అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ మొదటి ఫోన్ సెప్టెంబర్ 2026 లో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.

డిజైన్ , కలర్: ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం, ఈ ఫోన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో, ఫ్లాట్ రియర్ ప్యానెల్ మరియు రౌండెడ్ కార్నర్స్‌తో సరికొత్త లుక్‌లో రానుంది.

ధర ఎంత ఉండొచ్చు: మివి బ్రాండ్ ఎప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తులకే పేరుగాంచింది కాబట్టి, ఈ ఫోన్ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలోనే వచ్చే అవకాశం ఉంది.

కీలక నియామకం: స్మార్ట్‌ఫోన్ విభాగంలో పట్టు సాధించడం కోసం, పోకో మరియు సిఎమ్‌ఎఫ్ మాజీ కీలక అధికారి అయిన హిమాంశు టాండన్‌ను మివి తన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) గా నియమించుకుంది.

హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ, తెలంగాణలోని శంషాబాద్‌లోని తన స్వంత ప్లాంట్‌లో ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఫైర్-బోల్ట్ సంస్థ తన 'బోల్ట్' సబ్‌-బ్రాండ్‌తో ఫోన్లను తెచ్చిన కొద్ది రోజులకే, మివి కూడా ఈ రేసులోకి రావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి