Breaking News

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ పేరు ప్రతిపాదన


Published on: 28 May 2025 14:12  IST

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటూ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి వేళ.. కడపలో జరుగుతోన్న మహానాడు వేదికగా నారా లోకేష్‌కు కీలక పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదించారు. నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించామని సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ధూళిపాళ నరేంద్ర చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి