Breaking News

అమెరికాలో పెట్టుబడుల ద్వారా గ్రీన్ కార్డు పొందాలనుకునే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది

అమెరికాలో పెట్టుబడుల ద్వారా గ్రీన్ కార్డు (శాశ్వత నివాస హోదా) పొందాలనుకునే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఈబీ-5 (EB-5) ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Published on: 01 Oct 2026 11:34  IST

అమెరికాలో పెట్టుబడుల ద్వారా గ్రీన్ కార్డు (శాశ్వత నివాస హోదా) పొందాలనుకునే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఈబీ-5 (EB-5) ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రుసుములు 2026 నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ నిర్ణయం వల్ల అమెరికా గ్రీన్ కార్డు కల కలిగిన భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

కొత్త ఫీజుల వివరాలు

దరఖాస్తు రుసుములను దాదాపు రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువగా పెంచారు:

ఫారం I-526 : ప్రస్తుతం ఉన్న $3,675 నుంచి ఏకంగా $7,615 (సుమారు ₹6.40 లక్షలు) కు పెరిగింది.

ఫారం I-526E (రీజినల్ సెంటర్ల ద్వారా పెట్టుబడి పెట్టేవారికి): ప్రస్తుతం ఉన్న $3,675 నుంచి $7,850 కు పెంచారు. దీనికి అదనంగా $75 టెక్నాలజీ ఫీజు కూడా చెల్లించాలి.

ఫారం I-829 : ఈ దరఖాస్తు ఫీజును $3,750 నుంచి $5,000 (సుమారు ₹4.20 లక్షలు) కు పెంచారు.

మారని పెట్టుబడి మొత్తాలు:

ఫీజులు భారీగా పెరిగినప్పటికీ, ఈబీ-5 ప్రోగ్రామ్ కింద పెట్టాల్సిన కనీస పెట్టుబడి మొత్తాలలో ఎలాంటి మార్పు లేదు.

అర్హత కలిగిన ప్రాంతాలలో (TEA) కనీస పెట్టుబడి $800,000 (సుమారు ₹6.7 కోట్లు) గానే కొనసాగుతుంది.

ఇతర సాధారణ ప్రాజెక్టులకు $1.05 మిలియన్లు (సుమారు ₹8.8 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement