Breaking News

11న హౌసింగ్‌ బోర్డు స్థలాల వేలం..


Published on: 29 May 2025 18:17  IST

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ ఫేస్‌-7 పరిధిలో 4 నివాస, 15 వాణిజ్య ప్లాట్లకు వచ్చే నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నివాస ప్లాట్ల ధర చదరపు గజానికి రూ.1.25 లక్షలుగా, వాణిజ్య ప్లాట్ల ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. నివాస ప్లాట్ల వైశాల్యం కనిష్ఠంగా 194 గజాలు, వాణిజ్య ప్లాట్ల వైశాల్యం 800 నుంచి 920 గజాల వరకు ఉంది. నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి