Breaking News

తప్పు చేస్తేనే సారీ చెబుతా:తగ్గేదే లేదన్న కమల్ హాసన్


Published on: 30 May 2025 16:17  IST

తమిళ్ నుంచే కన్నడ భాష పుట్టిందని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా డిమాండ్ చేసింది.. లేదంటే ఆయన సినిమాల విడుదలపై బ్యాన్ విధిస్తామని అల్టీమేటం జారీ చేసింది. అయితే కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను కమల్ హాసన్ తోసిపుచ్చారు. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతా.. కానీ నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి