Breaking News

పాక్‌ కోసం పనిచేస్తున్న మరో యూబ్యూబర్‌ అరెస్ట్‌!


Published on: 04 Jun 2025 15:34  IST

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మరో యుట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ అనే యూట్యూబర్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాన్‌మహల్ వీడియో అనే పేరుతో జస్బీర్‌ సింగ్‌ యూట్యూబ్ ఛానెల్‌ నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌కు పది లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి షకీర్‌తో జస్బీర్‌ సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి