Breaking News

ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌..


Published on: 04 Jun 2025 17:50  IST

ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అనంతరం మీడియాతో మంత్రి దామోదర మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్‌‌ను తొలగించాలని మంత్రి దామోదర ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి