Breaking News

వణుకుతున్న టెహ్రాన్‌


Published on: 19 Jun 2025 11:38  IST

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి.వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. ఇరాన్‌లోని అణు కార్యక్రమాన్ని, సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌ గగనతలం తమ అధీనంలోకి వచ్చిందని చేసిన ప్రకటనతో భయాందోళన చెందుతన్న టెహ్రాన్‌ ప్రజలు.. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏ క్షణాన తమపైన బాంబుల వర్షం కురిపిస్తాయోనని ప్రాణాలు ఉగ్గబెట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement