Breaking News

విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌


Published on: 04 Apr 2025 15:39  IST

అమరావతి: రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారకుడిపై చట్టప్రకారం చర్యలుంటాయని తెలిపారు. నాగాంజలి సూసైడ్‌ నోట్‌ మేరకు ఇప్పటికే ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు పవన్‌ తెలిపారు. విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి