Breaking News

విమానం గాల్లో ఉండగా ఇంజెన్ నుంచి మంటలు..


Published on: 26 Jun 2025 11:42  IST

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం గురించి మర్చిపోక మునుపే మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజెన్‌ నుంచి మంటలు చెలరేగడం ప్రయాణికులను కలవర పెట్టింది. అయితే, పైలట్లు వెంటనే విమానాన్ని చాకచక్యంగా లాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి