Breaking News

తెగిన జూరాల గేట్ల తాళ్లు


Published on: 27 Jun 2025 17:29  IST

ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్ల ఇనుప తాళ్లు (రోప్‌లు) తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్‌ గేట్లు ఉండగా.. ఎనిమిది గేట్ల రోప్‌లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చారు. 8, 12, 19, 27 గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉండగా.. ఈలోపే తెగిపోయాయి. కృష్ణా నదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం 12వ నంబరు గేటు నుంచి నీళ్లు లీకవుతున్నాయి. మరికొన్ని గేట్ల రబ్బరు సీళ్లు దెబ్బతిన్నాయి

Follow us on , &

ఇవీ చదవండి