Breaking News

హన్మకొండ సుబేదారి లోని జిల్లా కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు

హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి జిల్లా జడ్జికి ఈమెయిల్ పంపినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.


Published on: 04 Apr 2025 18:29  IST

హన్మకొండ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి జిల్లా జడ్జికి ఈమెయిల్ పంపినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈమెయిల్‌ పంపిన వ్యక్తి ఎవరన్నది ఇంకా స్పష్టతలేదు. పోలీసులు ఆ మెయిల్‌కు మూలమైన వ్యక్తిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కోర్టు పరిసరాల్లో బాంబు ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పూర్తి స్థాయిలో సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.

మేడ్చల్ కలెక్టరేట్‌కి కూడా అలాంటి బెదిరింపు

ఇటీవల మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికీ అలాంటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. 'కలెక్టరేట్‌ను పేల్చేస్తామంటూ' వచ్చిన ఈమెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గౌతం ఆదేశాలతో పోలీసులు, డీసీపీ కోటిరెడ్డి నేతృత్వంలో ఈమెయిల్‌ ఆధారాలపై విచారణ చేస్తున్నారు.గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మెయిల్ కరీంనగర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరుతో వచ్చిందని చెబుతున్నారు. చివర్లో "అల్లాహు అక్బర్" అనే పదాలు కనిపించాయని సమాచారం.ఈ బెదిరింపుల నేపథ్యంలో కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉద్యోగులను బయటకు పంపించి, డాగ్‌ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌ బృందాలతో భద్రతా దళాలు సంపూర్ణ తనిఖీలు చేపట్టాయి.

Follow us on , &

ఇవీ చదవండి