Breaking News

ఎంపీ కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ల్యాండ్‌ ‘గిఫ్ట్‌’!


Published on: 28 Jun 2025 14:36  IST

మహారాష్ట్ర లో ఓ ఎంపీ కారు డ్రైవర్‌కు నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు ప్రారంభించారు. ఈ భూమిపై దివాన్‌ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్‌ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్‌డీడ్‌గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి