Breaking News

తెలంగాణలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి


Published on: 30 Jun 2025 10:52  IST

పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ (సోమవారం) భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు.. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. కార్మికులకు తీవ్రగాయాలు అవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి