Breaking News

ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు...


Published on: 30 Jun 2025 12:39  IST

తెలంగాణలో భాజపా అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలి’’ అని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి