Breaking News

అనంత్‌ అంబానీ వార్షిక వేతనం రూ.20 కోట్లు


Published on: 30 Jun 2025 12:41  IST

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా నియమితులైన అనంత్‌ అంబానీ వార్షిక వేతనం రూ.10-20 కోట్లుగా ఉండొచ్చని కంపెనీ వాటాదార్లకు ఇచ్చిన నోటీస్‌ వెల్లడిస్తోంది. ఆయన ప్రస్తుతం రిలయన్స్‌ ఇంధన వ్యాపారాల బాధ్యతలు చూస్తున్నారు. గ్రూప్‌ దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించే రిలయన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టరుగానూ వ్యవహరిస్తున్నారు. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్‌ రిటెయిల్‌ వెంచర్స్‌ బోర్డుల్లోనూ అనంత్‌ ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి