Breaking News

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన..


Published on: 02 Jul 2025 11:42  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బుధవారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రేపు (గురువారం) పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి