Breaking News

తెలంగాణలో డీలర్లకు రేషన్ ఇవ్వొద్దు అని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

మహబూబ్‌నగర్ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు మరియు నాలుగు పురపాలక సంఘాల్లో రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలు.


Published on: 09 Apr 2025 13:37  IST

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత, ఎన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు ఊపొచ్చింది. అయితే, ఈ ప్రక్రియలో జరిగిన కొన్ని తప్పిదాలు ఇప్పుడు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.ప్రస్తుతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు మరియు నాలుగు పురపాలక సంఘాల్లో రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పౌరసరఫరాల శాఖ అనుకోకుండా రెండు సంవత్సరాల చిన్నారుల పేరిట కార్డులు మంజూరు చేసింది. వీరికి బియ్యం కోటా కూడా ఇచ్చారు కానీ పంపిణీ విషయంలో స్పష్టత లేక గందరగోళం నెలకొంది.

డీలర్లకు “చిన్నారులకు రేషన్ ఇవ్వొద్దు” అని ఆదేశాలు జారీ చేయడంతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో, ప్రభుత్వం తాజాగా ఈ చిన్నారుల పేర్లపై జారీ చేసిన కార్డులను రద్దు చేసింది. పిల్లల పేర్లను వారి తల్లిదండ్రుల కార్డుల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మార్చిలో పనిచేసిన కార్డులు, ఏప్రిల్‌లో ఆపేయబడటంతో తల్లిదండ్రులు  “అప్పుడు ఇవ్వగా, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? అని” ప్రశ్నలు వేస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 335 రేషన్ దుకాణాల పరిధిలో 12,487 కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి. వీటిలో 1,305 కార్డులు చిన్నారుల పేర్లపై ఉండగా, అవన్నీ ఇప్పుడు రద్దు అయ్యాయి. 2014 నుంచి దరఖాస్తు చేసిన వారి వివరాలను పరిశీలించి ఈ కొత్త కార్డులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.గ్రామాల్లో అవగాహన కల్పించడంతో చాలా తల్లిదండ్రులు పిల్లల పేర్లను తమ కార్డుల్లో చేర్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు మాత్రం దరఖాస్తు చేయకుండానే పిల్లల వివరాలు నమోదు చేశారు. ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పిల్లల పేర్లను తమ రేషన్‌ కార్డులో జతపరచాలని తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా చిన్నారుల పేర్లపై కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు, రేషన్ పంపిణీకి కూడా తల్లిదండ్రుల ఉండాల్సిందే  అయినందున, ఇది నిరుపయోగమని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈ తప్పును గ్రహించి వెంటనే చర్యలు తీసుకుంది.

జాబితా తయారీ సమయంలో సమగ్ర సర్వే లేకపోవడం వల్లే ఈ లోపాలు వచ్చాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సర్వే చేసి జాబితా తయారు చేసి ఉంటే ఇలాంటి తప్పులు జరిగేవి కావని వారు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి