Breaking News

కుక్క అరుపు.. 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు..


Published on: 08 Jul 2025 14:10  IST

హిమాచల్ ప్రదేశ్‌ మండి జిల్లాలో జూన్ 30 అర్ధరాత్రి భారీ కొండచరియ విరిగిపడింది. అయితే సియతి గ్రామంలో ఓ ఇంటి రెండో అంతస్తులో నిద్రిస్తున్న కుక్క గట్టిగా అరుస్తూ యజమానిని నిద్రలేపింది. అతడు వెంటనే ఇంట్లో ఉన్నవారిని, పక్కింటివారిని నిద్రలేపి సురక్షితంగా బయటకు తరలించాడు. కొన్ని నిమిషాల్లోనే వాళ్లు అలా వెళ్లగానే ఆ గ్రామంపై మరో భారీ కొండచరియ విరిగిపడింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం తలెత్తకుండా మాత్రం ఆ కుక్క కాపాడింది.

Follow us on , &

ఇవీ చదవండి