Breaking News

వాట్సాప్ వర్షన్ 2.2450.6 కంటే పాత వర్షన్ వాడుతున్నవారికి హెచ్చరిక.

భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వాట్సాప్‌ను కంప్యూటర్‌లో వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికను విడుదల చేసింది.


Published on: 10 Apr 2025 12:35  IST

వాట్సాప్‌ను కంప్యూటర్‌లో వాడుతున్న వినియోగదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరికను భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) విడుదల చేసింది. కంప్యూటర్‌లో వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నవారికి సైబర్ మోసాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా స్పూఫింగ్ అటాక్ అనే సాంకేతికత ద్వారా హ్యాకర్లు వినియోగదారుల కంప్యూటర్లలోకి హానికరమైన ఫైళ్లను పంపించే అవకాశం ఉంది.

ఈ సమస్యకు కారణం, వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో ఉన్న కొన్ని ఫైల్ హ్యాండ్లింగ్ లోపాలు. అందులో ముఖ్యంగా MIME టైప్ మరియు ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ల మధ్య ఉండే మిస్‌కాన్ఫిగరేషన్‌ను హ్యాకర్లు తమ లాభానికి ఉపయోగించుకుంటున్నారు. వినియోగదారులు వాటిని ఓపెన్ చేసినపుడు, ఆ ఫైళ్లు వాట్సాప్‌లోనే ఓపెన్ కావడంతో హ్యాకర్లు అర్బిట్రరీ కోడ్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. ఇది విండోస్ కంప్యూటర్లకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ వర్షన్ 2.2450.6 కంటే పాత వర్షన్ వాడుతున్నవారు ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

ఈ సమస్య నుంచి రక్షణ పొందాలంటే వినియోగదారులు తక్షణమే వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సర్ట్-ఇన్(CERT-In) సూచించింది. అలాగే, తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేయకుండా జాగ్రత్త వహించాలంది. లేకపోతే, వ్యక్తిగత సమాచారం బయటపడే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కాపాడే దిశగా ఓ కొత్త అప్డేట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.దీని ద్వారా:

  • మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇకపై అవతలి వారు సేవ్ చేయలేరు,

  • ఇతరులకు ఫార్వర్డ్ చేయడానికి కూడా మీ అనుమతి అవసరం ఉంటుంది.

ఈ ఫీచర్ మొదటగా iOS యూజర్లకు, తరువాత Android వాడుకదారులకు అందుబాటులోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి