Breaking News

ప‌న్నా గ‌నిలో గిరిజ‌న కార్మికుడికి దొరికిన వ‌జ్రం..!


Published on: 09 Jul 2025 17:28  IST

సుమారు 40 ల‌క్ష‌లు ఖ‌రీదైన వ‌జ్రాన్ని ఓ గిరిజ‌న కార్మికుడు గుర్తించాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా జిల్లాలో ఉన్న గ‌నిలో ఆ డైమెండ్ అత‌నికి క‌నిపించింది. కృష్ణ క‌ల్యాణ ప‌ట్టిలో ఉన్న ఓ గ‌నిలో మాధ‌వ్ అనే కార్మికుడు ప‌నిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సుమారు 11.95 క్యారెట్ల ఖ‌రీదైన రాయిని అత‌ను గుర్తించిన‌ట్లు జిల్లా అధికారి తెలిపారు. అయితే రూల్స్ ప్ర‌కారం ప‌న్నా డైమండ్ ఆఫీసులో ఆ ఖ‌రీదైన రాయిని కార్మికుడు డిపాజిట్ చేసిన‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లో ఆ వ‌జ్రాన్ని వేలం వేయ‌నున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి