Breaking News

మేడిగడ్డకు భారీ వరద


Published on: 11 Jul 2025 09:07  IST

మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గురువారం సాయంత్రం 6.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 85 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి 10.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 25.8 అడుగులకు చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి