Breaking News

తమ భూములు తమకివ్వాలని కోరుతున్న మామిడిపల్లి రైతులు

మామిడిపల్లిలో ఉన్న సర్వే నంబర్‌ 99/1 లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి. మా తాతముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకొని జీవించినం తమ భూములు తమకివ్వాలని కోరుతున్న రైతులు.


Published on: 15 Apr 2025 11:41  IST

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14: కంచ గచ్చిబౌలి భూ వివాదం తర్వాత ఇప్పుడు మామిడిపల్లి భూములు చర్చకు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లిలోని 2131 ఎకరాల భూములు 1956లో అటవీ శాఖ కింద మేత భూములుగా మారాయి. అనంతరం పశుసంవర్ధక శాఖకి బదలీ అయి, అక్కడి బీసీ రైతులు పంటలు వేసుకుంటూ జీవనం సాగించారు.

2001లో శంషాబాద్‌ విమానాశ్రయానికి భూసేకరణ మొదలై, రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంది. అయితే compensation అందుకున్న వారు కొందరే. ఇంకా 186 మంది రైతులు తమకు న్యాయం దక్కలేదని చెబుతున్నారు. కొన్ని వేల రూపాయలకే ప్రభుత్వం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని ఆరోపిస్తున్నారు.

రైతులు పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పలు కమిటీలు నివేదికలు ఇచ్చినప్పటికీ పరిహారం అందలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ భూములను వేలం వేసేందుకు సిద్ధపడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయంగా తమకు రావలసిన పరిహారం ఇప్పటికైనా ఇవ్వాలని, ప్రభుత్వంపై మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి