Breaking News

నందినగర్‌ గ్రౌండ్స్‌లో ఆక్రమణల కూల్చివేత


Published on: 17 Jul 2025 18:56  IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లోని నందినగర్‌లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై ఎట్టకేలకు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో స్పందించిన అధికారులు.. జేసీబీల సాయంతో ఆక్రమణలను కూల్చివేశారు.పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సాయంతో ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన హోటళ్లు, టీస్టాల్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను నేలమట్టం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి